![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -101 లో.... రామలక్ష్మి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి గుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా అని అడుగుతాడు. మీకు ఏం అవుతాను సర్.. కొన్ని రోజల తర్వాత మీ జీవితం లో నుండి వెళ్ళిపోతాను.. అలాంటింది నా గురించి ఇంత శ్రద్ద తీసుకుంటున్నారని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు నీ బాధ్యత నాది కాబట్టి నీ ఆశయం నిజం చెయ్యడం నా బాధ్యత అని సీతాకాంత్ అంటాడు.
ఆ తర్వాత మాణిక్యం ఆఫీస్ కి వెళ్తాడు. సీతాకాంత్ ఆఫీస్ కి రాలేదని తెలిసి తన క్యాబిన్ కి వెళ్లి.. తన టూ ఇయర్స్ అగ్రిమెంట్ పేపర్ ని వెతుకుతాడు.. అగ్రిమెంట్ పేపర్స్ మాణిక్యానికి దొరుకుతాయి.. ఇక వాటిని చూస్తూ మాణిక్యం హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు అభిని సీతాకాంత్ మనుషులు కొడుతుంటారు. నన్ను అరెస్ట్ చేస్తే స్టేషన్ కి తీసుకొని వెళ్ళాలి కానీ ఇలా ఎక్కడో పెట్టి కొట్టడమేంటి? ఎవరు సర్ మీరు? ఆ సీతాకాంత్ మనుషులేనా అని అభి అనగానే.... అప్పుడే సీతాకాంత్ వచ్చి కరెక్ట్ గా చెప్పావని అంటాడు. రామలక్ష్మి గురించి నేను రాసిన అగ్రిమెంట్ పేపర్స్ నాకిస్తే.. నిన్ను వదిలేస్తానని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి నా గుప్పిట్లో ఉంటేనే నువ్వు నేను చెప్పినట్టు చేస్తావ్.. అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వనని అభి అంటాడు. సరే ఇక మీ స్టైల్ లో డోస్ పెంచండి అని సీతాకాంత్ చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు శ్రీలత డాక్టర్ ని ఇంటికి పిలిచి సిరికి హెల్త్ చెక్ అఫ్ చేయిస్తుంది. రామలక్ష్మిని చూపిస్తూ తను నా పెద్ద కోడలు ఇంకా ప్రెగ్నెంట్ అవట్లేదు.. ఒకసారి చూడండి అని శ్రీలత అంటుంది. వద్దని రామలక్ష్మి అంటుంది. ఎందుకు అలా అంటున్మావని శ్రీలత అనగానే... ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారేమో వాళ్ళ రీజన్స్ వాళ్లకు ఉంటాయి కదా అని సిరి అంటుంది.
సిరి చెప్పిందే మా రీజన్ అని ఇంకొకసారి దీని గురించి అడగకండి అని రామలక్ష్మి వెళ్తుంది. ఆ తర్వాత అభి దెబ్బలకి తట్టుకోలేక ఆపండి అంటాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు అగ్రిమెంట్ ఇస్తానని అభి అంటాడు.. తన ఫ్రెండ్ కి కాల్ చేసి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని రమ్మని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మికి ఫోన్ చేసి కలిసి మాట్లాడాలని చెప్పు అని అభికి సీతాకాంత్ చెప్పగానే.. రామలక్ష్మికి అభి ఫోన్ చేసి కలిసి మాట్లాడాలని అంటాడు.. నేను చెప్పినట్టు రామలక్ష్మితో మాట్లాడాలని అభితో సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |